యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, చిన్న లక్ష్మాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఉరి వేసుకునే మృతి చెందాడు. ఎస్సై తక్యుద్దీన్ శనివారం మధ్యాహ్నం తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న లక్ష్మాపురం గ్రామానికి చెందిన దుబ్బాల శ్రీకాంత్ రెడ్డి(42) వ్యక్తి వ్యవసాయ భావి వద్ద చింత చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై తక్యుద్దిన్ తెలిపారు.