సారధ్యం యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ వద్ద ఛాయ్ పై చర్చ కార్యక్రమంలో ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎంపీ పాకా సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ.. బలాన్ని ఇచ్చే నగరం భీమవరం, పక్క రాష్ట్రాలలో కూడా భీమవరానికి మంచి పేరు ఉంది అని అన్నారు. అతిథి మర్యాదలుకు భీమవరం పరాకాష్ట అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పూర్తి తో సారథ్యం యాత్ర నిర్వహిస్తున్నాం అని చెప్పారు.