విశాఖ నీలమ్మ వేప చెట్టు గుడి సమీపంలో శ్రీ గణపతి నీలమాంబ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ గణపతి మండపం వద్ద గురువారము ముందడుగు న్యూస్ ఛానల్ అధినేత మల్లేష్ ఆధ్వర్యంలో ఇటీవల మలేషియాలో జరిగిన ఆసియా పసిఫిక్ 3.0 యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025 విశాఖకు చెందిన గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ వి కే వి కే కళాధర్ యోగ మాస్టారుకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంక బ్రత బక్చి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరము సిపిఐ చేతుల మీదుగా యోగ మాస్టర్ కళాధర్ రావుకు ఘనంగా సత్కరించి అభినందించారు.