రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను నిరసిస్తూ శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం అంబేద్కర్ సర్కిల్ లో ఎఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరసింహమూర్తి మాట్లాడుతూ, రాష్ట్రంలో 10 ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాలల పీపీపీ విధాన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. పీపీపీ విధానం అమలు చేస్తే వందలాది మంది ప్రతిభ గల విద్యార్థులకు ఎంబీబీఎస్