ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో వివిధ కేటగిరీలకు చెందిన 7వేల కేసులకు పైగా పరిష్కరించినట్లు జిల్లా న్యాయమూర్తి భారతి చెప్పారు.అలాగే మోటారు వాహన ప్రమాద బీమా కేసుల్లోనూ,కొన్ని రకాలైన ఇతర కేసులలో రాజీ విధానంలో 2 కోట్ల రూపాయలు విలువైన చెల్లింపులు చేశామన్నారు.లోక్ అదాలత్ నిర్వహణకు 25 బెంచీలను ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.సహకరించిన అన్ని శాఖలకు కృతజ్ఞతలు తెలిపారు.