ఏలూరు జిల్లా కలిదిండి, సానారుద్రవరం గ్రామాల్లో దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా విగ్రహాలకి పేడపూసి అవమానించిన దోషులను కఠినంగా శిక్షించాలని భీమడోలులో కాపునాయకులు ఆందోళన చేపట్టారు. ఆదివారం భీమడోలు సంతమార్కెట్ సెంటర్‌లోని రంగా విగ్రహానికి కాపు సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. రంగా విగ్రహాన్ని అవమానం చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈసందర్బంగా కాపునేతలు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకి కృషి చేసిన దివంగతనేత వంగవీటి రంగా విగ్రహాలకు పేడ పూసి శునకానందం పొందుతున్న దోషు