జగిత్యాల జిల్లా,మల్యాల మండల కేంద్రంలోని గోడౌన్ల వద్ద హైనా బుధవారం కలకలం రేపింది,గోడౌన్ల వద్ద కాపలాగా ఉన్న కుక్కపై దాడి చేసి హతమార్చింది, గిడ్డంగుల ఆవరణలో మృతి చెందిన కుక్కను చూసి అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు,దీంతో గిద్దంగుల వద్దకు చేరుకున్న అటవీశాఖ అధికారులు గోడౌన్ల చుట్టూ పరిశీలించి పాదముద్రలను కొలిచి ఇది హైనానే అని నిర్ధారించి 2:50 PM కి వెల్లడించారు అటవీశాఖ అధికారులు,సందర్భంగా గిడ్డంగి వద్ద ఉన్న సిబ్బంది మాట్లాడుతూ పనిలో భాగంగా గిడ్డంగి వద్దకు రాగానే మృతి చెంది ఉన్న కుక్కను చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించామని తెలిపారు,