హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆదేశాలతో శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా పలువురి , ఆసుపత్రి ఖర్చుల కోసం 'ముఖ్యమంత్రి సహాయ 'నిధి' నుంచి రూ.11,08,007. రూపాయలు హిందూపురం నియోజకవర్గం వ్యాప్తంగా 21 మందికి మంజూరు కావడంతో ఆ చెక్కులను లబ్ధిదారులకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వగృహంలో టిడిపి నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శులు వీరయ్య , బాలాజీ లబ్ధిదారులు,హిందూపురం మండల టిడిపి కన్వీనర్ రాము, లేపాక్షి మండల కన్వీనర్ అభిలాష్ క్లస్టర్ ఇంచార్జ్ మారుతీ ప్రసాద్ పాల్గొన్నారు.