అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గ్రామాల్లో రైతుసేవ కేంద్రాలు వివిధ పర్టిలైజర్ దుకాణాల్లో అధిక ధరలకు యూరియాను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మండల తాసిల్దార్ అనిల్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం శ్రీరంగాపురం నరసాపురం గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలను తనిఖీ చేసి యూరియా పంపిణీ విధానాన్ని గ్రామ రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి రైతుకి బయోమెట్రిక్ ఆధారంగానే ఎరువులను ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సిబ్బందికి తహసిల్దార్ సూచించారు.