రైతులందరికీ రుణమాఫీ చేయాలని తలమడుగు మండల రైతులు కదం తొక్కారు.పంట రుణాల మాఫీ పేరట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రైతులను పూర్తిగా మోసం చేస్తుందని,కేవలం కొంతమంది రైతులకు మాత్రమే రుణాలు మాఫీ చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తూ మండల కేంద్రంలో వందలాది మంది రైతులు సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.శవయాత్రను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులకు రైతులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది..