ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు బిజెపి జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గౌడ్. వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్న కురిసిన భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్ నగర్ నీట మునిగిన ఇండ్ల వరద బాధితులకు నష్టం పరిహారం మరియు వరదతో పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని స్థానిక ఎమ్మెల్యే వారిని పరామర్శించిన పాపను కూడా పోలేదని అన్నారు