గత 30 సంవత్సరాలుగా కేబుల్ టీవీ రంగం పైనే ఆధారపడి తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని సిద్దిపేట ఎస్ఎస్సి కేబుల్ ఆపరేటర్ల సంఘం నాయకులు శ్రీనివాస్ గౌడ్, చంద్రారెడ్డిలు తెలిపారు. ఇప్పుడు ఒక్కసారిగా విద్యుత్ స్తంభాల వెంట ఉన్న తమ కేబుల్స్ తొలగిస్తే కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం సిద్దిపేట ఎస్ ఈ కార్యాలయంలో కేబుల్ వైర్లు తొలగించొద్దని కోరుతూ వినతి పత్రం అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. హైదరాబాదులో జరిగిన ఒక సంఘటనను సాకుగా చూపి విద్యుత్ స్తంభాలపై ఉన్న డిష్ కేబుల్స్ ను తొలగిస్తే తాము తీవ్రంగా నష్టపోతామన్నారు.