చౌక ధాన్యపు దుకాణాల్లో నిత్యావసరుకులు పంపిణీల్లో తూకాలకు సంబంధించి తేడాలు వస్తే చర్యలు తప్పవని అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల తహసీల్దార్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం మండల పరిధిలోని నరసాపురం, రమనేపల్లి గ్రామాల్లోని 15,13 నెంబర్ల చౌక ధాన్యపు దుకాణాలను వీఆర్వో రాజశేఖర్ తో కలిసి ఆకస్మికతనికి నిర్వహించారు. దుకాణంలో పంపిణీలకు సంబంధించి స్టాక్ రిజిస్టర్లు బఫర్లను పరిశీలించారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఈ సందర్భంగా తహసిల్దార్ డీలర్లకు హెచ్చరించారు.