అయ్యప్ప దీక్ష, హనుమాన్ దీక్ష, సాయి దీక్ష మాదిరిగానే ఇకనుండి వినాయకుని దీక్షలు సైతం నిర్వహించనున్నట్లు మున్నూరు కాపు సంఘం నాయకులు వెల్లడించారు. సోమవారం సంఘం అధ్యక్షుడు కాళ్ల విఠల్ మీడియాతో మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 26 నుండి గణపతి దీక్ష మాల ధారణ చేపడుతున్నట్లు తెలిపారు. మాల ధారణ వేస్తే ప్రజలు తమను సంప్రదించవచ్చు అన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, సభ్యులు జైపాల్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు