దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం సంయుక్త స్నాతకోత్సవం (8వ, 9వ, 10వ, 11వ & 12వ స్నాతకోత్సవం) సెప్టెంబర్ 05 వతేదీ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య డి.సూర్యప్రకాశ రావు తెలిపారు. బుధశారం డాబాగార్డెన్స్‌లోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. శుక్రవారం బీచ్‌రోడ్డులోని నోవోటెల్, హోటల్‌లో స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నరసింహ గౌరవ అతిథిగా విచ్చేస్తారు