నల్గొండ జిల్లా, చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది ప్రధాని మోడీ తల్లి పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం మధ్యాహ్నం బిజెపి శ్రేణులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పట్టణ అధ్యక్షుడు సత్యం గౌడ్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మని దగ్ధం చేసి మాట్లాడుతూ.. రాజకీయంగా ఎదుర్కోలేక రాహుల్ గాంధీ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ తల్లి పై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.