వీ.కోట: మండల పోలీస్ స్టేషన్ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు, కొమరం అడుగు వద్ద ఓ ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి రోడ్డు పక్కగా ఉన్నటువంటి కరెంటు ఫోల్ ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం కొరకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మృతి చెందిన వ్యక్తి ఎవరు, ఏ ప్రాంత వాసి అనేది దర్యాప్తు చేస్తున్నాము వివరాలు వెల్లడిస్తామన్నారు.