రెంజల్ మండల పరిధిలోని కందకుర్తి, పేపర్ మిల్ గ్రామాలలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడంతో భారీగా సోయా పంట నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఈ గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన సోయా పంటను పరిశీలించారు. తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు,రైతులతో కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రైతులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన సోయా పంటను పరిశీలించి, నివేదిక సమర్పించాలని మండల వ్యవసాయ అధికారిని ఆదేశించారు.