పలమనేరు: రూరల్ మండలం స్థానికులు తెలిపిన సమాచారం మేరకు. కొలమాసనపల్లి పంచాయతీ గొల్లపల్లి గ్రామం వద్ద కల్లాడు గ్రామానికి చెందిన చంద్ర అనే వ్యక్తి ఆదివారం రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొని తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు గమనించి పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించిన విషయం విధితమే. పరిస్థితి విషమించడంతో వైద్యులు తిరుపతి రుయా హాస్పిటల్ రిఫర్ చేశారు నేడు అక్కడ చికిత్స పొందుతూ చంద్ర మృతి చెందారని తెలిపారు. కాగా ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు, పేదవారు కావడంతో ఉన్న పెద్దదిక్కు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.