ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మంగళవారం ఆటో డ్రైవర్లు భిక్షాటన చేసి తమ నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టడంతో తమ ఆటోలలో కనీసం ఎవరు ఎక్కే వారు లేక ఆర్థికంగా నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో ఆర్టీసీ బస్సులలో బిక్షాటన చేసి కూటమి ప్రభుత్వంపై అసహనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా నష్టపోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.