సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శనివారం నార్సింగి పీహెచ్సీ ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన పరిసరాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. డాక్టర్ రవికుమార్కు పలు సూచనలు చేశారు.