రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో రైతులకు యూరియాను అందించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులకేశ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి నగరంలోని జిల్లా కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో నిర్వహించిన డి.ఆర్.సి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ శివరామరెడ్డి, జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ వారిని ప్రశ్నించారు. గతంలో కంటే మెరుగైన సేవలను రైతులకు అందిస్తున్నామన్నారు.