యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్, నారాయణపురం మండల కేంద్రాలలో మార్వాడీలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించి, శుక్రవారం మధ్యాహ్నం స్వచ్ఛందంగా షాపులను బందు చేశారు. ఈ సందర్భంగా పలువురు వర్తక వ్యాపారులు మాట్లాడుతూ... మార్వాడీలు నాసిరకం వస్తువులు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ బచావో.. మార్వాడి హటావో అంటూ నినాదాలు చేశారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా తమ పుట్ట కొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.