కేంద్ర ప్రభుత్వం ముడిపత్తి దిగుమతులపై 11% సుంకాన్ని ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల అనుబంధ రైతు సంఘాల ఆధ్వర్యంలో పాల్వంచ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి,అనంతరం డిప్యూటీ తహాసిల్దార్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ... నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా బడా గుత్తపెట్టబడిదారులకు,విదేశీ పాలకవర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని అన్నారు..