తెలంగాణ ఉద్యమకారుడు, ఆర్ముర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ ఛైర్మన్ సడాక్ బాలకిషన్ మృతికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి ఆర్ముర్ ప్రాంత రైతాంగానికి తీరని లోటు అన్నారు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.