అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపంపేట వద్ద ఆదివారం 11 గంటల 40 నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో శ్రీ శక్తి పథకం విజయోత్సవ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని అందులో భాగంగా మహిళలకు శ్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా రాష్ట్రమంతా బస్సు సౌకర్యం ఉచితంగా అందించడం జరిగిందని అందుకు కృతజ్ఞతగా శ్రీ శక్తి పథకం విజయోత్సవ ర్యాలీలో వందలాది మహిళలు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.