కుల మతాలకు అతీతంగా నిజామాబాద్ జర్నలిస్టులు ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథున్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. కుల మతాలకు అతీతంగా నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం వినాయకుడిని నిమర్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.