ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలో పెన్షన్లు పొందుతున్న 94 మంది వికలాంగులకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో బ్రహ్మయ్య శుక్రవారం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ఆదేశాల మేరకు పెన్షన్ల వెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. అర్హులుగా వికలాంగులు పెన్షన్ పొందుతున్న వారు తప్పనిసరిగా తమ వికలాంగుల సర్టిఫికెట్లతో ఎంపీడీవో కార్యాలయాన్ని సంప్రదించి వెరిఫికేషన్ చేయించుకోవాలని ఎంపీడీవో బ్రహ్మయ్య అన్నారు. అడ్డదారిలో సర్టిఫికెట్ పొంది పెన్షన్లు తీసుకుంటుంటే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.