ఈనెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు విశాఖలోని కొన్ని కార్యక్రమాలలో జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తెలిపారు, పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్ పరిశీలించారు.