వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్కు ఆదివారం జనం పోటెత్తారు. సెలవు దినం కావడంతో బీచోరోడ్డులోని ఎంజీఎం మైదానం కిటకిటలా డింది. కొరియా టు వైజాగ్ పేరుతో ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్వాహకులు స్థానిక హోటల్ మేనేజ్మెం టల్ విద్యార్థులతో ఆయా వంటకాలను తయారు చేయించారు. కొరియన్ రుచులను ఆస్వాదించేందుకు భోజన ప్రియులు భారీగా బారులు తీరారు. ఈ సందర్భంగా ఎయిర్ వాక్ ఆర్ట్ పేరిట దిల్లు బ్రదర్స్ ప్రదర్శించిన విన్యాసాలు, కళాకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి సోమవారం డోన్ విజువల్స్ అధికారులు విడుదల చేశారు