నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కౌన్సిల్ పల్లిలో కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ పై రాంచందర్ గౌడ్, అశోక్ గౌడ్, నవీన్ గౌడ్ తో పాటు 15 మంది కర్రలు, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్పృహ కోల్పోయిన శ్రీనివాస్ ను జనరల్ హాస్పిటల్ లో చేర్పించారు. దాడి చేసిన వారు పోలీస్ స్టేషన్ కు వచ్చి రాజీకి ప్రయత్నించడం విశేషం. ఈ ఘటనలో అఖిల్ రెడ్డి, కార్తీక్ కుమార్ కూడా పాల్గొన్నారు.