సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం జిల్లాలోనీ గ్రామ పాలన అధికారుల యొక్క కౌన్సిలింగ్ ప్రక్రియ జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్ తో కలిసి నిర్వహించారు. జిపిఓ పరీక్షలో ఫేస్-1 మరియు ఫేస్-2 లో ఎంపికైన 149 మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారమే కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగిందని జిల్లాలో స్వంత నియోజకవర్గం కాకుండా వేరే నియోజక వర్గం లోని మెరిట్ ప్రకారం పలు గ్రామాలను ఎంచుకున్న 149 మంది నియామక పత్రాల తీసుకుని ఎంచుకున్న గ్రామంలో వెంటనే జాయిన్ కావాలని ఆదేశించారు.