పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ పంచాయతీ రాజ్ (ప్రాజెక్ట్స్) ద్వారా రూ.9 కోట్లు వ్యయంతో మొగల్తూరు నుండి కొప్పర్రు వరకు శేరేపాలెం మీదుగా నిర్మించబోయే బి.టీ రోడ్ కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మొగల్తూరు మండలంలోని నీటితిప్ప మరియు జగన్నాధపురం గ్రామాలలో సి.సి రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో అయిన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి స్థానిక గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.