మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని శ్రీనివాస్ నగర్ 17వ వార్డు కు చెందిన కుష్ణపల్లి నవీన్ అనే వ్యక్తి మనస్థాపానికి గురై బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తవక్కల్ పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య మానస, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నవీన్ కు చెందిన ద్విచక్ర వాహనాన్ని ఫైనాన్స్ వారు స్వాధీనం చేసుకోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎస్సై సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.