చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు ముడియప్ప సర్కిల్ నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి, కూటమి నాయకులు ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో జేబు దొంగలు రెచ్చిపోయారు. ముడియప్ప సర్కిల్ వద్ద కూటమినాయకుల జేబుల్లో నగదును కాజేసిన దొంగలు. ఓజేబుదొంగని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులు అప్పగించిన నాయకులు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు లో తెలియాల్సి ఉంది.