కరీంనగర్ జిల్లా,గంగాధర మండలం,మధుర నగర్ లో అంజనీపుత్ర లోన్స్& ఇన్సూరెన్స్ కన్సల్టెన్సీ పేరుతో శనివారం రోజు ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది, ఇల్లు,స్థలం కొనుగోలుకు రుణాలు ఇప్పిస్తామని నమ్మించి కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు, ఇప్పిస్తానన్నా రుణం రాకపోవడంతో అనుమానం వచ్చిన 25 మంది బాధితులు మోసపోయామని గంగాధర పోలీసులను ఆశ్రయించారు,బాధితుల నుంచి అధిక మొత్తంలో సొమ్ములు వసూలు చేసిన నిర్వాహకుడు దోమల రమేష్ ను 5:50 PM కి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు,గతంలోనూ ప్రజలను మోసం చేసి ఇలాగే డబ్బులు వసూలు చేసినట్లు,బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చర్య చేపట్టామని తెలిపారు,