అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నర్సింగబిల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. విజయ్ కుమార్ (32) స్కూటీపై అనకాపల్లి వైపు వెళుతుండగా ప్రైవేట్ బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో కింద పడిపోయిన విజయ్ కుమార్ తీవ్రంగా గాయపడడంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.