వినాయక చవితి పండుగ సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డి, వృక్షశాస్త్రము, ఫారెస్ట్ మరియు రసాయన శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రకృతిలో లభించే సహజమైన మట్టితో ఎలాంటి రసాయనాలను కలపకుండా పర్యావరణహిత వినాయక విగ్రహాలను తయారు చేసి ప్రదర్శించారు. పిఓపి విగ్రహాలు వాడకాలను నిషేధించి మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్టించి నిమజ్జనం చేయడం ద్వారా నీటి కాలుష్యం అరికట్టవచ్చని తెలిపారు. నీటిలో ఉండే జలచర జీవులకు ఎటువంటి ప్రాణాన్ని జరగకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ పి.విశ్వప్రసాద్ ,వృక్ష శాస్త్ర విభాగాధిపతి డా.టీ దినకర్ పాల్గొన్నారు.