ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో "హిందూ యువ సేన" మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన 15 అడుగుల ఎత్తైన భారీ మట్టి గణనాథుడికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదవితరణతో పాటు హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు నిర్వహించారు. జిల్లాలోనే అత్యంత ఎత్తైన మట్టి వినాయకుడిగా ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మట్టి గణపతిని పూజించడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.