పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి తారాజీతో సమావేశమయ్యారు. స్థానిక మున్సిపాలిటీల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలపై ఇరువురూ కీలక చర్చలు జరిపారు. ఈ భేటీ ద్వారా పాలమూరు ప్రాంత అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టే దిశగా అడుగులు పడ్డాయి.