Download Now Banner

This browser does not support the video element.

బోధన్: బోధన్ లో ట్రాన్స్ఫార్మర్ను ఢీకొన్న కారు, ఆరుగురు యువకులకు గాయాలు

Bodhan, Nizamabad | Sep 12, 2025
నిజామాబాద్ జిల్లా బోధన్ లో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బోధన్-నాందేడ్ రహదారిపై సాలూర శివారులో ఓ కారు ప్రమాదానికి గురైంది. ఎడపల్లి నుంచి బీర్కూర్ వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురు యువకులకు గాయాలయ్యాయి. కారు, ట్రాన్స్ఫార్మర్ ధ్వంసమయ్యా యి. సంఘటనా స్థలానికి చేరుకున్న బోధన్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us