రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 9, 10, 11,12వ వార్డుల్లో పలు కుల సంఘ భవనాల నిర్మాణం కోసం మంజూరైన ప్రొసీడింగ్ పత్రాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం అందజేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు 43 కుల సంఘాలకు రూ.2.58 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పేద, అట్టడుగు వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలందరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని కోరారు.