Download Now Banner

This browser does not support the video element.

కనగానపల్లిలో స్వయం సహాయక సంఘాలకు రూ.4 కోట్ల 46 లక్షల రుణాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత

India | Aug 22, 2025
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కనగానపల్లి మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘ మహిళలకు స్రీ నిధి రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ కనగానపల్లి మండలంలో స్వయం సహాయక సంఘ మహిళలకు 513 మంది మహిళలకు నాలుగు కోట్ల 46 లక్షల రూపాయల శ్రీ నిధి చెక్కులను మహిళా సంఘాలకు అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని మహిళలు సభ్యులను సద్వినియోగం చేసుకొని మహిళలు బ్యాంకుకు రుణాలు సక్రమంగా చెల్లించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us