దివ్యాంగుల కోసం నిర్వహించే శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విలీన విద్య సమన్వయకర్త ప్రవీణ్ కుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో ఆదివారం సమగ్ర శిక్ష, ఆలింకో ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల గుర్తింపు, నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. నిర్మల్ డివిజన్ లోని 0 నుంచి 18 సంవత్సరాల లోపు దివ్యాంగ విద్యార్థులకు నిర్దారణ శిబిరాలు నిర్వహించి అవసరమైన ఉపకరణాలను ఆలింకో సంస్థ ద్వారా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో దివ్యంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.