వెదురుకుప్పం మండలం ధర్మచెరువు గ్రామంలో సోమవారం పెన్షన్ల పంపిణీ జరిగింది. ఇందులో భాగంగా MLA థామస్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ నగదు పంపిణీ చేశారు. తమ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.