కాకినాడ జిల్లా పెద్దాపురం పట్నం జి.రాగంపేట రోడ్ లో ఉన్న బ్లూ ఓసిన్ కంపెనీలోని పనిచేస్తున్న కార్మికులను తక్షణమే వీధిలోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తొలగించిన 78 మంది కార్మికులతో పెద్దాపురం నందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కనీసం ముందస్తు నోటీసులు లేకుండా కార్మికులను గేటు ముందే ఆపివేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. లే ఆఫ్ అంటూ ప్రకటించడం అన్యాయమని ఇది కార్మికుల పొట్ట కొట్టడమే అని అన్నారు.