శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో శుక్రవారం రాత్రి సమయపాలన పాటించకుండారోడ్డుపై ఉన్నాడంటూ 30 వవార్డ్ వైసిపి కౌన్సిలర్ ఆసిఫ్ ను పోలీసులు అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.రాజకీయ కక్షతో వైసిపి కౌన్సిలర్ ఆసిఫ్ ను అరెస్ట్ చేశారని వైసిపి నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి ఆసిఫ్ అక్రమ అరెస్టు ఆపాలి' రెడ్బుక్ రాజ్యాంగం నశించాలి అని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.కౌన్సిలర్ ఆసిఫ్ కు మద్దతుగా పలువురు వైసిపి నాయకులు దాదాపు గంటపాటు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు