ఎమ్మిగనూరులో CMRF చెక్కుల పంపిణీ..పేదలకు సీఎం సహాయనిధి వరమని ఎమ్మిగనూరు MLA బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం తన నివాసంలో ఆరుగురికి రూ.6.97 లక్షలు విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం MLA మాట్లాడుతూ.. వేలాది మంది పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఆర్థిక భరోసా ఇస్తోందని చెప్పారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.