కరీంనగర్ నగరంలోని లోయర్ మానేరు జలాశయంలోకి వరద తగ్గుతున్నట్లు డ్యాం అధికారులు గురువారం తెలిపారు. మధ్యాహ్నం నుంచి వరుణుడు కాస్త నిమ్మదించడంతో మానేరు జలాశయంలోకి భారీగా వస్తున్న వరద ఉధృతి తగ్గుముఖం పట్టిందని తెలిపారు. మిడ్ మానేరు, మోయ తుమ్మెంత వాగు నుంచి లోయర్ మానేరు జలాశయంలోకి 72.495 క్యూసెక్కుల వరద నీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిందని, అది కాస్త సాయంత్రం నుంచి తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ప్రస్తుతం 56,944 క్యూసెక్కుల నీరు డ్యాం లోకి వస్తున్నట్లు తెలిపారు.16,623 టీఎంసీల కు నీటి నిల్వ చేరుకున్నట్లు తెలిపారు.