ఏలూరు జిల్లా కలిదిండి మండలం ఉప్పల తిప్ప గ్రామానికి చెందిన ఐదుగురు భక్తులు వెంకటేశ్వరుని దర్శనార్థం తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.ఆ బృందం శుక్రవారం రాత్రి చీరాలకు చేరుకుంది.ఈ సందర్భంగా వారికి స్థానికులు విడిది, ఆహారం ఏర్పాటు చేశారు.ఈనెల రెండవ తేదీన తాము పాదయాత్ర ప్రారంభించి నాలుగో రోజుకు చీరాల చేరుకున్నట్లు ఆ భక్తులు తెలిపారు.దారి పొడవునా తమను ప్రజలు ఆదరిస్తున్నట్లు వెల్లడించారు.